పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు

పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు
  • సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి
  • జిల్లా ఎన్నికల అధికారి శివలింగయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ : జిల్లాలో నిర్వహించే ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌‌ సి.హెచ్‌ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ఎన్నికల నోడల్ అధికారులు, సంబంధిత ఎన్నికల విభాగం సిబ్బంది, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కావాల్సిన శిక్షణా తరగతులు ఇప్పటికే విడుతల వారీగా పూర్తి చేశామన్నారు.

ఎన్నికల సిబ్బంది ప్రతి పనిని జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ప్రత్యేక అధికారులు ఎప్పటికీ అప్పుడు  క్షేత్ర స్థాయిలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల సహాయ అధికారి సుహాసిని, ఎన్నికల నోడల్ అధికారులు ఇస్మాయిల్, వినోద్ కుమార్, రంగాచారి, అనిల్ కుమార్, మోగులప్ప, కొండల్‌రెడ్డి, చంద్రశేఖర్, డాక్టర్ ప్రశాంత్, రాజేందర్ రెడ్డి, ఏవో రవీందర్ పాల్గొన్నారు.