ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు  పకడ్బందీగా చేపట్టాలి 

ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు  పకడ్బందీగా చేపట్టాలి 
  • నిజామాబాద్ పార్లమెంట్  నియోజకవర్గం సాధారణ పరిశీలకురాలు  అలిస్ వాజ్ అర్  

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని నిజామాబాద్ పార్లమెంట్  నియోజకవర్గం సాధారణ పరిశీలకురాలు  అలిస్ వాజ్ అర్ అన్నారు. కోరుట్ల, జగిత్యాల శాసన సభ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, రిసెప్షన్ అండ్ డిస్ట్రిబ్యుషన్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కోరుట్ల, జగిత్యాల శాసన సభ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. కోరుట్ల నియోజకవర్గం పరిధిలోని ఎస్.ఎఫ్.ఎస్. హైస్కూల్ లో ఏర్పాటు చేసిన ఈ.వి.ఎం. స్ట్రాంగ్ రూమ్ లను రిసెప్షన్ అండ్ డిస్ట్రిబ్యుషన్ కేంద్రాన్ని ఆమె తనిఖి చేశారు.

అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల లోని 5 పోలింగ్ కేంద్రాలను, పైడిమడుగు గ్రామీణ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలను, కోరుట్ల పట్టణంలోని గౌతమ్ హై స్కూల్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రాలను ఆర్దిఒ ఆనంద్ కుమార్ తో కలిసి పరిశీలించారు. నిర్వహణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. అనంతరం జగిత్యాల గ్రామీణ మండలం   చలిగల్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్ లలోని పోలింగ్ కేంద్రాలను ఆర్దిఒ పి. మధుసుధన్ తో కలిసి పరిశీలించారు.  జగిత్యాల పట్టణంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ అండ్ డిస్ట్రిబ్యుషన్ కేంద్రాన్ని, కమిషనింగ్ హాల్ ను పరిశీలకురాలు పరిశీలించారు. ఈ కార్యక్రమాలలో ఆమె వెంట సంబంధిత ఆర్దిఒలు, తహశిల్దార్లు కిషన్, రాం మోహన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.