జిజ్ఞాసలో రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు

జిజ్ఞాసలో రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం, కంప్యూటర్  కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగంలో జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్స్ లో రాష్ట్రస్థాయికి ఎంపికైన  విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డా. వై సత్యనారాయణ అభినందించారు. వృక్ష శాస్త్ర విభాగంలో రాష్ట్రస్థాయిలో జిజ్ఞాస స్టడీ ప్రాజెక్ట్ ఎంపిక కావడంలో సూపర్వైజర్ గా పని చేసిన డాక్టర్ పడాల తిరుపతి,  కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగంలో శ్రీమతి బి సంగీత,  స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్  కోఆర్డినేటర్ రసాయన శాస్త్ర విభాగాధిపతి శ్రీమతి జి మానస ను లనుఈ సందర్భంగా అభినందించారు.

విద్యార్థి దశ నుంచే విద్యార్థులలో పరిశోధన, అభిరుచిని పెంపొందించే దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలని, అన్ని విభాగాలలో విద్యార్థులను ఇదేవిధంగా ప్రోత్సహించాలని,  భారతదేశం యొక్క అభివృద్ధి పరిశోధన, అభివృద్ధి పై ఆధారపడి ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా. మసురు సుల్తానా,   అకాడమిక్ కోఆర్డినేటర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ జ్యోతిలక్ష్మి, కల్చరల్ కోఆర్డినేటర్ జంతుశాస్త్ర ఆచార్యురాలు డాక్టర్ కే కిరణ్ మై,  కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఇంచార్జ్, గణిత శాస్త్ర విభాగాధిపతి శ్రీమతి తాటి స్వరూప రాణి,  ఐ క్యు ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ హరి జ్యోతికౌర్, వృక్ష శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జి చంద్రయ్య, ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ అంబాల శంకరయ్య, కామర్స్ విభాగాధిపతి మల్లారం శ్రీనివాస్ రెడ్డి, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ మామిడిపల్లి సత్య ప్రకాష్ పాల్గొన్నారు.