పదవ తరగతి ఫలితాల్లో 10 జిపిఎ సాధించిన స్లేట్ హై స్కూల్

పదవ తరగతి ఫలితాల్లో 10 జిపిఎ సాధించిన స్లేట్ హై స్కూల్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  జగిత్యాల పట్టణంలోని స్లేట్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధించడంతో పాఠశాల ఆవరణలో సంబరాలు నిర్వహించారు. 2023-24 ఎస్ఎస్సి ఫలితాల్లో పాఠశాలకు చెందిన పి. వికాస్ రెడ్డి 10/10 జి పి ఎ సాధించగా టి. నీహారిక సింగ్ 9.8 , కే. మునీందర్ రెడ్డి, వర్శిని 9.7 సాధించగా 10 మంది విద్యార్థులు 9.0 జిపిఏ సాధించినట్లు ప్రిన్సిపాల్  తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ జగన్ మోహన్ రెడ్డి, డైరెక్టర్ తిరుపతి రెడ్డి అభినందించారు. ఫలితాల సాధన కృషి చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.