ఇద్దరు మావోయిస్టు పార్టీ సాంకేతిక నిపుణుల టీం సభ్యుల  అరెస్ట్ - రామగుండము సీపీ రెమారాజేశ్వరి 

ఇద్దరు మావోయిస్టు పార్టీ సాంకేతిక నిపుణుల టీం సభ్యుల  అరెస్ట్ -  రామగుండము సీపీ రెమారాజేశ్వరి 

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: రామగుండము పోలీస్ కమీషనరేట్, మంచిర్యాల జోన్  జైపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని ఇందారం గ్రామం లోని ఒక ఇంట్లో  నిషేదిత సీపీఐ(మావోయిస్ట్) పార్టీ, టెక్నికల్ డిపార్ట్‌మెంట్, సెంట్రల్ టెక్నికల్ టీమ్ క్యాడర్  గంగాధర  రావు అలియాస్ నర్సన్న అలియాస్ బక్కన్న అలియాస్ వెంగో దాదా మరియు అతని భార్య భవానీ అలియాస్ సుజాత అలియాస్ శ్యామల,  డివి సీఎం, సిపిఐఎం,  డీకే ఎస్ఐసి, సిపిఐ- మావోయిస్టు పార్టీ మెంబర్ ల ను శనివారం అరెస్టు చేసినట్టు రామగుండం సిపి రెమా రావుజేశ్వరి రామగుండం కమిషన్ రేట్ లో  విలేకరుల సమావేశంలో తెలిపారు. రామగుండం కమిషన్ రేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని ఓ ఇంటిలో వారు ఉన్నారనే  సమాచారం మేరకు రామగుండము పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక బృందం  ఇంటిని తనిఖి చేసి వారిని అదుపులోకి తీసుకోని పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేసి  అరెస్ట్ చేశామన్నారు. 

పట్టుబడిన వారి వివరాలను ఆమె తెలిపారు.  

గంగాధర రావు అలియాస్ నర్సన్న అలియాస్ బక్కన్న అలియాస్ వెంగో దాదా  (80) సంవత్సరాలు, శెట్టి బలిజ ఆంధ్ర ప్రదేశ్, అంబేద్కర్ కోన సీమ జిల్లా, డెల్టా గన్నవరం మండలం, నరేంద్రపురం గ్రామానికి చెందినవారని, ప్రస్తుతం వారు జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ఉంటున్నారని, పట్టుబడిన వారి నుండి జాలంపల్లి బక్కయ్య పేరు మీద ఆధార్ కార్డు, జాలంపల్లి లక్ష్మి పేరు మీద ఆధార్ కార్డు. నికర నగదు రూ.1,57,900/-,జాంపెల్లి లక్ష్మి పేరు మీద పాన్ కార్డ్, జాలంపల్లి బక్కయ్య పేరు మీద పాన్ కార్డ, జలంపల్లి లక్ష్మి పేరు మీద ఎస్బిఐ బ్యాంక్ పాస్‌బుక్. ఎస్బిఐ ఎటిఎం కార్డ్,రెండు మొబైల్ ఫోన్ లు,మెమరీ కార్డ్‌లు -6, శామ్సంగ్ ట్యాబ్,12. పెన్‌డ్రైవ్‌లు -2,  పాకెట్ డైరీ 14. పెన్,  రెండవ సెషన్ రిజల్యూషన్‌లు, జూన్-2021-(11) పేపర్‌లు, తెలంగాణ రాష్ట్ర రెండవ ప్లీనరీ తీర్మానాలు డిసెంబర్ 2019-(8) పేపర్లు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సీపీఐ-మావోయిస్ట్ జూన్ 2017 ఆరవ సెషన్-(6) పేపర్లు లభించయన్నారు.

ఇప్పుడు జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ఉంటున్నారని, నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీ సాంకేతిక విభాగంలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారని, అతను 1969లో వైజాగ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ చదివాడు. అతను భవాని @ సుజాత @ శ్యామల @ లామిని ని  వివాహం చేసుకున్నాడని, వారికి ఒక కుమార్తె ఉందని, 1972లో జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లి హైదరాబాద్‌లోని ఆస్బెస్టాస్ తయారీ ప్రైవేట్ కంపెనీలో చేరి 1980 వరకు ఆ కంపెనీలో పనిచేశాడని, అక్కడ మావోయిస్టు పార్టీ సిటీ కమిటీ ఆర్గనైజర్ విశ్వం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడని, 1980లో మావోయిస్టు పార్టీలో చేరారని, తర్వాత మావోయిస్టు పార్టీ యూజీలో చేరి, 2000 సంవత్సరంలో కేంద్ర కమిటీ ఆయనకు సాంకేతిక విభాగం బాధ్యతలు అప్పగించిందన్నారు. అందులో అతను ఆయుధాలు మరియు పేలుడు పదార్థాల తయారీదారుని గా పనిచేసాడని, పది నెలల క్రితం కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న ఆదేశాల మేరకు ఆయన తన సతీమణి భవాని అలియస్ సుజాత అలియస్ శ్యామల, వయస్సు 60 సంవత్సరాలు, మావోయిస్టు పార్టీ అభివృద్ధి కోసం మావోయిస్టు పార్టీ అర్బన్ నెట్‌వర్క్, పార్టీని బలోపేతం చేయడం కోసం, పార్టీ నిధుల కోసం, పార్టీలోని యువతను పెద్ద సంఖ్యలో ప్రేరేపించడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతర ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడడానికి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామానికి వచ్చారని, అనుమానం రాకుండా ఉండేందుకు జల్లంపెల్లి బక్కయ్య, జల్లంపెల్లి లక్ష్మి పేర్లతో నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు తయారు చేసి, ఆ పేర్లతో ఇందారంలో స్థలం కొనుగోలు చేసి చిన్న ఇల్లు నిర్మించుకున్నారని,  అప్పుడప్పుడు, వారు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సిరొంచకు వెళ్లి, మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు చంద్రన్న మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కర్, బండి ప్రకాష్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌లతో కలిసి పార్టీ సమావేశాలకు హాజరవుతారని, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను వారితో వాట్సాప్‌లో చర్చించేవారని, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గడ్, జార్ఖండ్, రాష్ట్రాల్లో  గత రెండు మూడు సంవత్సరాలుగా తిరుగుతూ మావోయిస్టు కార్యకలాపాలు చేయడం జరిగిందని, గత కొద్ది నెలల క్రితం ఇందారం గ్రామానికి వచ్చారని, ఇతనికి సహాయం చేసిన సిపిఐ మావోయిస్టు సానుభూతిపరుడైన చిప్పకుర్తి శ్రీనివాస్ పెంచికల్పేట్ మండలం కమాన్ పూర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతన్ని కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే అతని పట్టుకుంటామన్నారు. వీరి పై జైపూర్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 240/2023, U/sec ,120(B)r/w34 IPC  మరియు sec 10,13,18,18(b) అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన చట్టం-1967 ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది.