సూరారం సర్పంచ్ పై దాడి: ప్రజల నిరసన

సూరారం సర్పంచ్ పై దాడి: ప్రజల నిరసన

మహాదేవపూర్, ముద్ర: సూరారం సర్పంచ్ నాగుల లచ్చిరెడ్డి పై నాగుల తిరుపతి అతని కుమారుడు పెద్ద మనుషుల సమక్షంలో కర్రలతో దాడి చేసి గాయపరచడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరిపై కౌంటర్ కోసరు నమోదు చేయడంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ గ్రామ ప్రజలు మహాదేవపూర్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. సూరారం సర్పంచ్ పై 16వ తేదీన నాగుల తిరుపతిరెడ్డి గడ్డ పలుకుతో దాడి చేయ ప్రయత్నించగా తనకు ప్రాణభయం ఉన్నట్లు ఆ రోజే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కన ఉన్న ఇంటి స్థలాల విషయంలో వీరిద్దరు ఘర్షణ పడటంతో పెద్ద మనుషుల ముందు పరిష్కరించుకునే క్రమంలో నాగుల తిరుపతిరెడ్డి సర్పంచ్ పై దాడి చేసి గాయపరిచినట్లు ఆయన తెలిపారు. పోలీసులు నిందితులపై కేసు పెట్టకుండా ఇద్దరిపై కేసు పెట్టడంతో ప్రజలలో నిరసన వ్యక్తం అయింది. ఈ మేరకు సూరారం నుంచి వచ్చిన గ్రామ ప్రజలు మహాదేవపూర్ మండల కేంద్రంలో పోలీసుల వైఖరిని నిదర్శిస్తూ ధర్నా చేశారు. కాగా సర్పంచ్ నాగుల లచ్చిరెడ్డి మహాదేవపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.