మండలానికి  అయోధ్య శ్రీరాముని అక్షింతలు

మండలానికి  అయోధ్య శ్రీరాముని అక్షింతలు

చిగురుమామిడి ముద్ర న్యూస్: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని రామ మందిర నిర్మాణం శ్రీరామచంద్రుని జన్మస్థలం అయోధ్యలో పూర్తయి జనవరి 22 న ప్రాణ ప్రతిష్ట మహోత్సవం కానున్న శుభ సందర్భంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య రామచంద్రుని పాదాల చెంత పూజలు అందుకుని దేశంలోని వివిధ గ్రామాలలోని అనంత కోటి రామభక్తుల చెంతకు శ్రీరామచంద్రుని అక్షింతలు చేరుతున్నాయి. అందులో భాగంగా గురువారం రోజు నుస్తులాపూర్ నుండి స్వామివారి కలశం, అక్షింతలు కరపత్రాలు తదితరములు  చిగురుమామిడి మండలానికి చేరాయి.

మండల కేంద్రంలోని పాంబండ ఆంజనేయస్వామి దేవాలయంలో భద్రపరిచి హూమేష్ స్వామి చేత పూజాధి కార్యక్రమాలు చేసి హారతులు ఇచ్చారు. ఈ సందర్బంగా రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తిమ్మాపూర్ ఖండ సభ్యులు కొంటు సంపత్ మాట్లాడుతూ... అయోధ్యలోని శ్రీరామ మందిరం నుండి వచ్చినటువంటి  అక్షింతలు  గ్రామాల్లోని భక్తులందరికీ చేరేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీరామోజు రాజ్ కుమార్,బుద్దార్తి మహేందర్,పోలోజు సంతోష్,తులాయిలా వెంకటేష్,జీల రాజు, శ్రీమూర్తి రమేష్,బింగి లక్ష్మీనారాయణ, బొల్లి సునీల్, పెనుకుల తిరుపతి, బత్తిని  కాటమ్ సంపత్ రెడ్డి, ముంజ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.