మతసామరస్యానికి ప్రతీక కరీంనగర్

మతసామరస్యానికి ప్రతీక కరీంనగర్
  • పరస్పర మతాలను గౌరవించుకునే సంస్కృతి తెలంగాణది
  • గణేష్ మండపాలకు విద్యుత్ సరఫరా అందిస్తాం
  • శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
  • రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
               
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :జిల్లాలో ఈ నెల 27, 28 తేదీల్లో జరుగు గణేష్ నవరాత్రులు, మిలాదున్ నబి పండుగలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర బీసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.శనివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో గణేష్ నవరాత్రి, మిలాదున్ నబి పండుగల ఏర్పాట్లపై నిర్వహించిన పీస్ కమిటి సమావేశంలో రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి  ముఖ్యఅతిధిగా పాల్గోన్నారు.  ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ,  సెప్టెంబర్ 27 న వినాయక చవితి  నిమజ్జనం రాత్రి ప్రారంభమై 28 ఉదయం 11 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, అదే విధంగా 28న జరుగనున్న మిలాదున్ నబి పండుగలను కులమతాలకు అతీతంగా గోప్పగా జరుపుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.  ఏ నగరంలో శాంతియుత వాతావరణం, అభివృద్ది జరుగుతుందో అక్కడ గోప్పనగరం అవిషృతం అవుతుందని, అలాంటి గోప్పనగరాన్ని మన భవిష్యత్తు తరాలకు అందించాల్సిన భాద్యత మనందరిపై ఉందని అన్నారు.   తెలంగాణ ఆవిర్బావానికి పూర్వం అభివృద్ది లేక వలసలు, వృత్తిని వదిలి కూలీ పనులకు వెళ్లే వారి సంఖ్య ఉండేదని అన్నారు.  తెలంగాణను సాధించుకున్న దశాబ్దిలోనే అమెరికా వంటి దేశాలలో మాత్రమే ఉండే గుగూల్, అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు తెలంగాణకు వస్తున్నాయన్నారు.   ఒకప్పుడు కరీంనగర్ కల్లోలిత ప్రాంతంగా ఉండేదని, పనిష్మెంట్ క్రింద కరీంనగర్ జిల్లాకు ఉద్యోగులను పంపే వారని అన్నారు.  కాని ఇప్పడు జిల్లాలో చేపడుతున్న అద్భుతమైన రోడ్లు, డ్రైనేజి వ్యవస్థతో కరీంనగర్ ను ప్రపంచస్థాయి పర్యాటకులను ఆకట్టుకునే గోప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేలా చేపట్టిన కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, మానేరు రివర్ ఫ్రంట్ తో జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగిపోయాయని, ఇలాంటి అభివృద్ది నిరంతరం కొనసాగడంతో పాటు ఎలాంటి అసాంఘీక కార్యక్రమాలు జరుగకుండా నిరోదించాల్సి భాద్యత మనందరిపై ఉందని మంత్రి అన్నారు.  

మత సమరసియానికి కరీంనగర్ ప్రతీక అని, తనమతాన్ని గౌరవిస్తూ, ఎదుటి వారి మతాన్ని గౌరవించుకునే గోప్ప సంస్కృతి తెలంగాణలో నెలకొందని, జిల్లాలో నిర్వహించుకోనున్న గణేష్ నవరాత్రుల శోభయాత్ర, మిలాదున్ నబి కార్యక్రమాలను శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని, మనమందరం మనల్ని మనం గౌరవించుకుంటు, రెండు పండుగలను సోదర భావంతో నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.  సర్వమతాలను గౌరవించుకుంటు, అన్ని రకాలుగా అభివృద్ది చెందిన కరీంనగర్ జిల్లాను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాద్యత మనందరిదని అన్నారు. నగర మేయర్ వై. సునీల్ రావు మాట్లాడుతూ, జిల్లాలో గణేష్ నవరాత్రుల శోభయాత్ర కొరకు మున్సిపల్ తరపున సానిటేషన్ తో పాటు స్టేజి, పబ్లిక్ అడ్రస్ సిట్టం ను ఏర్పాటు చేయనున్నామని, నిమజ్జనం నిర్వహించే చోట ఆలస్యం కాకుండా క్రెయిన్ లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అదే విధంగా మిలాదున్ నబి కార్యక్రమం కొరకు కూడా అన్ని రకాల వసతులను కల్పించడం జరుగుతుందని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాః బి. గోపి, సిపి సుబ్బారాయుడు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రుద్రరాజు, అడిషనల్ డి.సి.పి లు సి. రాజు,( పరిపాలన ), ఎ. లక్ష్మి నారాయణ  (శాంతి భద్రతలు), ఆర్డీవో కె.మహేశ్వర్, పీస్ కమిటి సభ్యులు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గోన్నారు.