భవిష్యత్ మనదే.. కార్యకర్తలు అధైర్య పడొద్దు..

భవిష్యత్ మనదే.. కార్యకర్తలు అధైర్య పడొద్దు..
  • కె ఆర్ పి కి ప్రాజెకుట్టులివ్వడం నల్లగొండ కు ద్రోహం: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
  • మీరు నిజాం వారసులైతే... మేము చాకలి ఐలమ్మ వారసులం..
  • కోమటిరెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నాడు : సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి
  • ఎన్నికలలో కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేయాలి

ముద్ర ప్రతినిధి భువనగిరి :భవిష్యత్ మనదే.. కార్యకర్తలు అధైర్య పడొద్దని,కె ఆర్ పి కి ప్రాజెకుట్టులిచ్చి ప్రభుత్వం నల్లగొండ కు ద్రోహం చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మీరు నిజాం వారసులైతే... మేము చాకలి ఐలమ్మ వారసులం.. కోమటిరెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని సూర్యాపేట మాజీ మంత్రి , ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం స్థానిక శ్రీ సాయి కన్వెన్షన్ హాల్లో బిఆర్ఎస్ భువనగిరి నియోజకవర్గం స్థాయి సమావేశానికి వారు ముఖ్య అతిథితులుగా హాజరై మాట్లాడుతూ పార్టీ బలంగా వుందని కార్యకర్తలు భవిష్యత్ కోసం ఆలోచన చేయాలన్నారు. 

కె ఆర్ పి కి ప్రాజెక్ట్ ఇవ్వడం ఇవ్వడం వలన నల్లగొండ కు  అందకుండా పోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.పాలనలో నిజాయితీ చూపాలన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుకై కార్యకర్తలు ముందుండి పోరాటం చేయాలన్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వండి అని ప్రశ్నిస్తే సమాధానం లేదన్నారు. ఎన్నికల హామీలైన రైతు రుణ మాపి, 400 వేల పింఛన్  ఇవ్వలేదన్నారు. జనవరిలో ఇయాల్సిన పింఛన్ ఫిబ్రవరిలో ఇచ్చినట్లు రైతుబంధు విషయంలో ఎలాంటి స్పష్టత లేదన్నారు. రాష్ట్రంలో రోజు కరెంట్ తీస్తూ  రైతులను కరెంటు కష్టాలకు గురిస్తుందన్నారు. కార్యకర్తలు, నాయకులు 420 హామీలపై గ్రామాలలో చర్చలు చేయాలనీ  సూచించారు.బీజేపీ ని ఓడించిన పార్టీ బి ఆర్  ఎస్ అన్నారు. అదాని కాంగ్రెస్ ఒక్కటే అన్నారు. రాష్ట్ర అప్పు ల పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ కోసం మాట్లాడే వారు బి ఆర్ ఎస్ ఎంపీలు మాత్రమే అన్నారు. 

కర్ణాటక లో కాంగ్రెస్ కె ఖతమయిందన్నారు. పార్టీ లో క్రమశిక్షణ చర్యలు తీసుకుని టి ఆర్ ఎస్ వి ని బలోపేతం చేయాలన్నారు. భువనగిరిలో పైళ్ల శేఖర్ రెడ్డి ఓడిపోలేదని కొంతమంది మోసం చేసారని చెప్పారు. తన సొంత డబ్బులతో అభివృద్ధి చేసారని చెప్పారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారంతో విర్రవిగడం మంచిది కాదని నల్లగొండ కు ఏం చేశావని ప్రశ్నిచ్చారు. పథకాలు అమలుకై పోరాటం చెయ్యాలన్నారు. రైతుబంధు అంటే చెప్పుతో కొట్టండి అనడం సరికాదని మీరు నిజం వారసులైతే మేము చాకలి ఐలమ్మ వారసులమని జైల్లో వేస్తాం అంటే బయపడేవారూలేరు అన్నారు.

మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా తోడుగా ఉంటానని అన్నారు.  బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతు పదవులు కాదు ముఖ్యం పార్టీ అన్నారు. 10  ఏళ్ళ నుండి పనిచేసాను నాకు ఎలాంటి పదవి ఇవ్వలేదన్నారు. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతు క్యాడర్ గట్టిగా వుందని 14 ఏళ్ళ వనవాసం నుండి మళ్లీ సొంత పార్టీలోకి వచ్చానని అన్నారు. ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం కృషి చెయ్యాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మాట్లాడుతు పార్టీలో లోపాలను సరిదిద్దు కోవాలని ఎంపీ సిట్లు గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గూడూరు సంఘటకు అందరు మద్దత్తు తెలిపారని చెప్పారు. ఈ సమావేశంలో  బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణరెడ్డి, బిఆర్ఎస్ నాయకులు కొలుపుల అమరేందర్, జడల అమరేందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్, జడ్పిటిసి బీరు మల్లయ్య, పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ, భువనగిరి మండలాల బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.