ముదిరాజ్ ద్రోహి కేసిఆర్ పతనం ఖాయం :ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు - పిట్టల అశోక్ ముదిరాజ్

ముదిరాజ్ ద్రోహి కేసిఆర్ పతనం ఖాయం :ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు - పిట్టల అశోక్ ముదిరాజ్

ముద్ర ప్రతినిధి భువనగిరి : బి.ఆర్ స్ పార్టీ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ముదిరాజ్ లకు మొండి చెయ్యి చూపిన ముదిరాజ్ ద్రోహి కేసిఆర్ పతనం ఖాయమని యాదాద్రి భువనగిరి జిల్లా మన ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు పిట్టల అశోక్ ముదిరాజ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ని గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముదిరాజ్ లను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణగదొక్కి శాశ్వత బానిసలుగా మార్చడానికి కేసిఆర్ కుట్రలు చేస్తున్నాడని అన్నారు. తెలంగాణ జనాభాలో పది శాతం లేని అగ్ర వర్ణాలకు 60 సీట్లు కేటాయించిన కేసిఆర్ జనాభా లో పదహారు శాతమున్న ముదిరాజ్ లకు ఒక్క సీటు కేటాయించకపోవడాన్ని మన ముదిరాజ్ మహాసభ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మా జాతి బిడ్డ ఈటెల రాజేందర్ ని పార్టీ నుండి సస్పెండ్ చేసి బండ ప్రకాష్ ని యం. పి నుండి ఎమ్మెల్సీ కి దిగదార్చారు ముదిరాజ్ లకు రాజకీయ నాయకత్వం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు కు బిసి కమీషన్ రిపోర్టు పంపకుండా ముదిరాజ్ లకు న్యాయంగా రావలసిన విద్య, ఉద్యోగ అవకాశాలు దెబ్బ తీస్తున్నది కేసిఆర్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. బీసీల లో బిసి బంధు లక్ష రూపాయల స్కీమ్ ముదిరాజ్ లకు వర్తింపజేయక పోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పేరు తో కేసిఆర్ ప్రభుత్వం మత్స్య రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. జీవో నెంబరు ఒకటి అమలు చేయడం లేదని, రాష్ట్రం మత్స్యకారులకు ఇవ్వక వలసిన ప్రోత్సాహకలు ఇవ్వకుండా కేంద్ర సహకారాన్ని కూడా అడ్డుకుంటున్నదని ఆయన తెలిపారు. ముదిరాజ్ జాతిని గ్రూపులుగా విడగోట్టి జాతి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు కేసిఆర్ ప్రభుత్వం చెస్తున్నదని ఆరోపించారు.

జనాభా లో అత్యధిక శాతం ఉన్న ముదిరాజ్ లకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించనందున బిఆర్ స్ పార్టీ ని ముదిరాజ్ జాతి బహిష్కరించిందని రాబోయే ఎన్నికల్లో కేసిఆర్ పోటి చేసే గజ్వేల్, కామారెడ్డి లో బి.ఆర్ స్ పార్టీ ని ఓడించడం ఖాయమని తెలిపారు. ముదిరాజ్ లకు చట్ట సభల్లో రాజకీయ ప్రాతినిథ్యం కల్పించలేని ఏ పార్టీకైన ఇదే మా హెచ్చరిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాధు విజయ్ ముదిరాజ్, బీసుకుంట్ల సత్యనారాయణ, కూర వెంకటేష్, కమ్మ వేంకటేష్, పిట్టల బాలరాజు, ఉస్మానియా జేఏసీ నాయకులు రాస వెంకట్ ముదిరాజ్, ఆకుల రమేష్, గీస కోండల్, పసులాది రాంచందర్ బోయిన బాలయ్య పాల్గొన్నారు.