గృహలక్ష్మి దరఖాస్తుల గడువు పెంచాలని కలెక్టర్ కి వినతి పత్రం

గృహలక్ష్మి దరఖాస్తుల గడువు పెంచాలని కలెక్టర్ కి వినతి పత్రం

 భువనగిరి ఆగస్టు 09 (ముద్ర న్యూస్) ప్రభుత్వం ప్రకటించిన గృహలక్ష్మి పథకానికి సంబంధించి దరఖాస్తులకు కేవలం మూడు రోజుల సమయాన్ని ఇవ్వడాన్ని నిరసిస్తూ బుధవారం భువనగిరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ యందు నిరసన తెలియజేసి కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గృహలక్ష్మి దరఖాస్తులకు కనీసం 20 రోజుల సమయం కేటాయించాలని, ఆదాయ కుల ధ్రువీకరణ పత్రాలు మొదలగు వాటి వల్ల మూడు రోజుల సమయం ఎలా సరిపోతుందని, సంక్షేమ పథకాలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని తెలపడం జరిగింది.

ఇల్లు లేని పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి ఇప్పటివరకు కూడా ఇవ్వలేదని, బీసీ చేతివృత్తిదారులకు అర్హులుగా ఉన్న చాలామంది కూడా అతి తక్కువ సమయం ఇవ్వడం వల్ల చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారని ఈ పథకం కూడా అదేవిధంగా కాకుండా, నియోజకవర్గానికి మూడు వేల యూనిట్లు కాకుండా, స్థలం ఉండి ఇంటి నిర్మాణానికి అర్హులుగా ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా ఈపథకాన్ని వర్తింపజేయాలని తెలియజేయడం జరిగింది. మద్యం షాపులపై ఇచ్చిన సమయానికన్నా ప్రజా సంక్షేమ పథకాలకు ఇచ్చే సమయం పై చిత్తశుద్ధి లేనటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీసే సమయం ఆసన్నమైందని తెలపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుక్కదువు సోమయ్య, సీనియర్ నాయకులు దొనకొండ రాములు, నక్కల ఆదినారాయణ, పోకల యాదగిరి, మాజీ కౌన్సిలర్ తాడూరి నరసింహ, మాజీ కోఆప్షన్ నెంబర్ సయ్యద్ ముల్తానిషా, పసుపులేటి సంతోష్, ఎండి యాకూబ్ పాషా, బండి శంకర్, భరత్, జహంగీర్, శ్రీధర్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది.