కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ చైర్ పర్సన్,ఇద్దరు కౌన్సిలర్లు

కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ చైర్ పర్సన్,ఇద్దరు కౌన్సిలర్లు
  • కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల :జగిత్యాలలో బీఆర్ ఎస్ కు మరో  షాక్ తగిలింది.జగిత్యాల మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, బిఆర్ఎస్ కౌన్సిలర్లు వారణాసి మల్లవ్వ తిరుమలయ్య,  చదువుల తిరుపతమ్మ తో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇటీవల జరిగిన జగిత్యాల మున్సిపల్  చైర్ పర్సన్ ఎన్నికలో  బిఆర్ఎస్ రెబల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా అడ్వాల జ్యోతి నామినేషన్ వేసి విజయం సాధించారు. చైర్ పర్సన్ గా అవకాశం కల్పిస్తానని  బిఆర్ఎస్ పార్టీ మోసం మోసం చేసిందని తిరుగుబాటు చేసి చైర్ పర్సన్ గా ఎన్నికైన జ్యోతి లక్ష్మణ్ లు  టిఆర్ఎస్ ను  వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే బిఆర్ఎస్ నాయకులు  న్యాయవాది సిరిపురం మహేందర్, బోగోజి ముఖేష్ ఖన్నా, ఆడే పు సత్యం,సిరిపురం వెంకటయ్య, తిరుమలయ్యలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ పార్టీకోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన, మైనారిటీ తో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ మళ్ళీ మేము సొంతింటిలోకి వచ్చామని, జీవన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి అనుకోని పరిస్థితుల్లో బి ఆర్ ఎస్ లో చేరి కౌన్సిలర్ గా గెలిచిన ఆపార్టీ ఎమ్మెల్యే  విధానాలు నచ్చక సంతృప్తి గా లేనని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డి ని గెలిపించికుందామని ,అందరూ కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతు0దని పేర్కొన్నారు. అలాగే  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి   నివాసంలో జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామం నుంచి  బి ఆర్ ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు  యువకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, విజయలక్ష్మి,  శంకర్, గాజంగి నందయ్య, అనిత, కౌన్సిలర్లు దుర్గయ్య, నక్క జీవన్, ములస్థం లలిత, నాయకులు మన్సూర్, గాజుల రాజేందర్, పుప్పాల అశోక్,  చిట్ల అంజన్న అనుమల్ల చంద్రం, గౌతం రెడ్డి, రఘువీ ర్ గౌడ్, సామ్రాట్, బొల్లి శేఖర్,మున్నా,తదితరులు పాల్గొన్నారు.