బిగ్ బ్రేకింగ్.. చంద్రబాబుకు బెయిల్ మంజూరు

బిగ్ బ్రేకింగ్.. చంద్రబాబుకు బెయిల్ మంజూరు
  • స్కిల్ కేసులో నాలుగు వారాల బెయిల్ ఇచ్చిన కోర్టు
  • మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
  • 52 రోజుల పాటు జైలులో ఉన్న టీడీపీ చీఫ్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలను చూపుతూ ఆయన దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ కు కోర్టు ఆమోదం తెలిపింది. నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు 52 రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్నారు. టీడీపీ అధినేత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను పలుమార్లు కొట్టేసిన కోర్టు.. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.