తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మహాజన సభను విజయవంతం చేయాలి - తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం పిలుపు

తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మహాజన సభను విజయవంతం చేయాలి - తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం పిలుపు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: నవంబర్ 5న ఉప్పల్ ఆత్మగౌరవ భవన నిర్మాణ స్థలంలో నిర్వహించే తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మహాజన సభను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పోతుగంటి వీరాచారి పిలుపున్నిచ్చారు. ఈ మేరకు విద్యానగర్ లోనే మాతృ సంఘం కార్యాలయంలో సోమవారం సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు.  ఈ తరుణంలో బీసీ కులాలలో చెప్పుకోదగ్గ జనాభా కలిగి ఉన్న విశ్వబ్రాహ్మణులైన మనం కమ్మరి వడ్రంగి కంచరి శిలా శిల్పం పని, స్వర్ణకార వృత్తులు చేయుచు మనందరం కలిసి  సంఘటిత శక్తి నీ ప్రదర్శించడం కోవలసిన  అవసరం ఎంతైనా ఉన్నదనీ గుర్తు చేశారు. మన విశ్వబ్రాహ్మల న్యాయమైన డిపాండ్ల సాధన కోసం తేదీ 5 -11 -2023 ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఉప్పల్ బగాయిత్ లో జరిగే విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మహాజన సభ కు సూర్యాపేట జిల్లా నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.  కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కట్రోజు గోపి జిల్లా నాయకులు జనగామ వీరాచారి, మోతె మండల సీతారామాచారి, ఆత్మకూరు మండల అధ్యక్షులు బెజ్జంకి ఉపేంద్ర చారి, నూతనకల్ మండల అధ్యక్షులు పోలోజు వెంకటేశ్వర్లు, నాగారం మండల అధ్యక్షులు పర్వతం శ్రీధర్, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు కడివెంటి సతీష్, సూర్యాపేట కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బైరోజు లింగాచారి, కాసోజు పాండురంగ చారి
తర్నోజు జనార్ధన చారి, మునిగడప వెంకటాచారి, కంచర్ల శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.