ఓట్లు వేసే కూలీలుగా కాకుండా బహుజనులు రాజ్యాధికారం చేపట్టాలి

ఓట్లు వేసే కూలీలుగా కాకుండా బహుజనులు రాజ్యాధికారం చేపట్టాలి

సూర్యాపేట నియోజకవర్గ బి ఎస్ పిలోకి వరద ప్రవాహంలా కొనసాగుతున్న వలసలు.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: నూటికి 85% కు పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ భజనలు అందరూ ప్రతి ఎన్నికలలో ఓట్లు వేసే కూలీలుగా కాకుండా రాజ్యాధికారం చేపట్టే రాజులాగా మారాలని మన ఓట్లు మనమే వేసుకొని మన బహుజన జాతులను చట్టసభలలోకి పంపాలని సూర్యపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేటలోని
 జమ్మిగడ్డ 20 వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ కుంభం రజిత నాగరాజు, సూర్యాపేట జిల్లా బిజెపిమైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మీర్ అక్బర్ ల ఆధ్వర్యంలో సుమారు 600 మంది బీఎస్పీ లో చేరిన సందర్భంగా బీఎస్పీ పార్టీ ఆఫీసులో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి విలేకరులతో మాట్లాడారు. గత 75 సంవత్సరాలుగా అగ్రవర్ణ నేతలకు ఓట్లు వేసి బానిసలా బతుకుతున్న  బహుజనులు ఈసారి ఎన్నికలలో నైనా ఉత్తరప్రదేశ్లో కాన్సీరామ్ మాయావతి అధికారంలోకి వచ్చిన విధంగా చైతన్యవంతులై రాష్ట్రవ్యాప్తంగా బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా అన్నగారిన వర్గాలు అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలంటే మాస్టర్ కి అనే రాజ్యాధికారం చేపట్టడం ఒక్కటే సరైన మార్గమని రాజ్యాధికారాన్ని చేపట్టి మన సంక్షేమం మన అభివృద్ధి కోసం మనమే చట్టాలను తయారు చేసుకొని బహుజనుల బతుకులను బాగు చేసుకుందామని జానయ్య యాదవ్ ఆకాంక్షించారు. ఆత్మకూరు ఎస్ మండలం ఇస్తాలపురం ఎంపీటీసీ చెరుకు ఇందిరా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో బీఎస్పీలో చేరారు. కందగట్ల గ్రామానికి చెందిన బొల్లె సైదులు, భారీ అశోక్, కోల కరుణాకర్, బొల్లె జానమ్మ తో పాటు మరో రెండు వందల మంది జానయ్య యాదవ్ సమక్షంలో బీఎస్పీలో చేరారు