ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు...

ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి ఆలయ పండితులు, అధికారులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సీఎం దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు చంద్రబాబు దంపతులకు వేద ఆశీర్వచనాన్ని అందించారు. 

ఆశీర్వచనం అనంతరం లడ్డు ప్రసాదాన్ని, అమ్మవారి చిత్రపటాన్ని చంద్రబాబు దంపతులకు ఆలయ ఈవో రామారావు అందజేశారు. కాగా చంద్రబాబు వెంట టీడీపీ కార్యకర్తలు, నాయకులు అభిమానులు ఆలయానికి వచ్చారు. కాగా దర్శనం అనంతరం చంద్రబాబు ఇంద్రకీలాద్రి నుంచి ఉండవల్లి నివాసానికి బయలుదేరారు.