కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెమ్మసాని ...

కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెమ్మసాని ...

ముద్ర,సెంట్రల్ డెస్క్:-టీడీపీ నేత, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. ‘‘నాకు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇచ్చినందుకు ప్రధాని మోదీ, చంద్రబాబులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.