నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. దరఖాస్తుకు నో ఫీజ్!

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. దరఖాస్తుకు నో ఫీజ్!

ముద్ర,తెలంగాణ:-  ఈ ఏడాది తెలంగాణలో జరిగిన టీజీ టెట్‌ ఫలితాలను  సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం మధ్యాహ్నం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాల్లో టెట్ పేపర్-1 లో 67.13 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 85,996 మంది పరీక్షకు హాజరు అవ్వగా వారిలో 57,725 మంది అభ్యర్థులు అర్హత పొందారు. 

పేపర్-2లో 34.18 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఈ క్రమంలో టెట్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టెట్ అర్హత సాధించని వారికి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. అర్హులు కాని అభ్యర్థులు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అర్హత సాధించిన వారు డీఎస్సీకి ఉచితంగా అప్లై చేసుకోవచ్చని టీజీ గవర్నమెంట్‌ తెలిపింది.