కొండగట్టులో పవిత్రోత్సవాలు ప్రారంభం

కొండగట్టులో పవిత్రోత్సవాలు ప్రారంభం

ముద్ర, మల్యాల: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి సన్నిధానంలో పవిత్రోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాల్లో బాగంగా మొదటిరోజు ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించిన అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు పూజలు, హోమం నిర్వహించారు.

శనివారం వరకు ఉత్సవాలు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేదపండితులు ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు పట్టు వస్త్రాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈవో అంజయ్య, ఫౌండర్‌ ట్రస్టీ మారుతీ, సూపరిండెంట్ సునిల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సంపత్, ఆలయ స్థానాచార్యులు జితేంద్రప్రసాద్‌, ప్రధాన అర్చకులు కపిందర్, చిరంజీవి, అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.