రైతులకు ఎకరాకు రూ.40 వేల పరిహారం చెల్లించాలి

రైతులకు ఎకరాకు రూ.40 వేల పరిహారం చెల్లించాలి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 40 వేల నష్టపరిహారం అందించాలని బిజెపి రాష్ట్ర నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీర్ పూర్ మండలం  తుంగురు గ్రామంలో గత మూడు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా తడిసిన  వరి , ధాన్యాన్ని ముదిగంటి రవీందర్ రెడ్డి పరిశీలించారు.

సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి జగిత్యాల నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో  వరి, మామిడి, నువ్వులు మొక్కజొన్న  వంటి పంటలు దెబ్బతిన్నాయన్నారు. రైతు పంట పండించే సమయం కంటే ఎక్కువ కొనుగోలు సెంటర్లో గడుపుతున్నారని, ఇప్పటికి చాలా గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదన్నారు. కొత్తగా పంటలు వేయడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనీ, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకం అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. కేసీఆర్ స‌ర్కార్ నిర్లక్ష్యం కారణంగా వరదలు, అకాల వర్షాలకు పంట నష్టపోవడం, పరిహారం అందకపోవడం పరిపాటిగా మారిందని, రాష్ట్రంలో ప్రకృతి విపత్తులకు పంటలు దెబ్బతిని రైతులు కుదేలవుతున్నా వారిని ఆదుకునే పథకమేదని, కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమ‌లు చేయ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌కరం అన్నారు. ఆయన వెంట  బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఆడేపు రమేష్, జిల్లా కిసాన్ మోర్చా  కార్యవర్గ సభ్యులు కంది రమేష్,  సబ్బ దేవరాజం, రఘువీరా రెడ్డి, రాజు, స్వామి, రాజశేఖర్, సతీష్, జ్ఞానేశ్వర్, రైతులు తదితరులు ఉన్నారు.