పలు గ్రామాల్లో సిసి రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం 

పలు గ్రామాల్లో సిసి రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం 

ముద్ర ప్రతినిధి భువనగిరి :  మండలంలోని పలు గ్రామాల్లో  సీసీ రోడ్లను భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి గురువారం ప్రారంభించారు. తాజ్ పూర్, బస్వాపురం, చందుపట్ల, గౌస్ నగర్, తుక్కాపూర్, నందనం, బొల్లపల్లి, ముస్త్యలపల్లి జాతీయ ఉపాధి హామీ నిధులతో నిర్మాణం చేసిన సిసి రోడ్లను ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్,  జెడ్పిటిసి బీరు మల్లయ్య, ఆయాగ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.