రూ.10 లక్షలతో పార్కు ప్రహరీ పనులు ప్రారంభం

రూ.10 లక్షలతో పార్కు ప్రహరీ పనులు ప్రారంభం

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 23వ డివిజన్ లో గల రెడ్డీస్ కాలనీలో పార్కు ప్రహరీగోడ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పది లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రహరీ నిర్మాణ పనులకు కార్పొరేటర్ రాసాల వెంకటేష్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు మహేష్, డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రాము, రామకృష్ణ, రామానంద, మస్తాన్, చంద్రమౌళి, సుధీర్, శ్రీనివాస్ రెడ్డి, సీసీఎంబీ కాలనీ అధ్యక్షుడు రవీంద్రబాబు, కాంగ్రెస్ నాయకులు పోతుల మల్లేష్, రాఘవ్ తదితరులు పాల్గొన్నారు.