దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు

దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడమే కాకుండా దాదాపుగా జీరోకు చేరిందని ఊపిరి పీల్చుకునేలోగా మరోసారి తలుపుతడుతోంది. గత కొద్దిరోజుల్నించి కరోనా వైరస్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. గత 24 గంటల్లో వేయికి పైగా కేసులు నమోదవడమే ఇందుకు ఉదాహరణ. చాలాకాలం తరువాత మరోసారి ఇండియాలో కరోనా మహమ్మారి కోరలు చాచేందుకు సిద్ధమౌతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 1134 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు అంటే మంగళవారంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. మంగళవారం దేశవ్యాప్తంగా 669 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఫలితంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7,026కు చేరుకుంది. మొత్తం కేసుల్లో ఇది 0.01 శాతంగా ఉంది. దేశంలోని గుజరాత్, ఢిల్లీ, చత్తీస్‌గడ్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరి చొప్పున 5 మంది కరోనా వైరస్ కారణంగా మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,813కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 662 మంది కోలుకోగా మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,41,60,279 మందికి చేరుకుంది. కోవిడ్ రికవరీ శాతం 98.79 శాతంగా ఉంది. మరోవైపు రోజువారీ పాజిటివ్ కేసుల రేటు 1.09 శాతముంది. వీక్లీ పాజిటివ్ రేట్ కూడా 0.98 శాతముంది.