కాంచ‌న్ జంగా రైలు ప్ర‌మాదంలో 15కి చేరిన మృతులు

కాంచ‌న్ జంగా రైలు ప్ర‌మాదంలో 15కి చేరిన మృతులు

ముద్ర,సెంట్రల్ డెస్క్:-వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సోమవారం రెండు రైళ్లు ఢీకొన్ని సంఘటనలో చనిపోయిన వారి సంఖ్య 15కి పెరిగింది. డార్జిలింగ్‌ జిల్లాలో ఒకే ట్రాక్‌ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడంతో ఓ బోగీ గాల్లోకి లేచింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది ప్రయాణికులు మృతిచెందగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. అస్సాంలోని సిల్చార్‌ నుంచి కోల్‌కతాలోని సీల్దాకు బయల్దేరిన కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్‌ మధ్యలో న్యూజల్‌పాయ్‌గుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికే రంగపాని స్టేషన్‌ సమీపంలో వెనక నుంచి ఓ గూడ్స్‌ రైలు దీన్ని బలంగా ఢీకొట్టింది.

సిగ్నల్‌ జంప్‌ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రెడ్‌ సిగ్నల్‌ వేసినా గూడ్స్‌ రైలు పట్టించుకోకుండా వెళ్లినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కాగా ట్రాక్ పై ప‌డిన రైళ్ల బోగీల‌ను తొల‌గించారు సిబ్బంది. అలాగే ట్రాక్ ను మ‌ర‌మ్మ‌తులు చేసి రైళ్ల రాక‌పోక‌ల‌ను పున‌రుద్ద‌రించారు..