ఎన్నికల కంట్రోల్ రూం, 1950 ఫిర్యాదుల విభాగాలను పరిశీలించిన అబ్జర్వర్

ఎన్నికల కంట్రోల్ రూం, 1950 ఫిర్యాదుల విభాగాలను పరిశీలించిన అబ్జర్వర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, ఎన్నికల కంట్రోల్ రూం, 1950 ఫిర్యాదుల విభాగాలను జిల్లా కలెక్టర్ షేక్ యా స్మిన్ బాషా తో కలిసి నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం సాధారణ పరిశీలకురాలు అలిస్ వాజ్ ఆర్ లు పరిశీలించారు. వారి వెంట అదనపు కలెక్టర్ పి.రాంబాబు, ఆర్డీఓ జగిత్యాల పి.మధుసూదన్, కలెక్టరేట్ పరిపాలన అధికారి హన్మంతు రావు, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్. భీమ్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు హకీమ్, తదితరులు పాల్గొన్నారు.