ఆయిల్ ఫామ్ సాగు తో రైతులకు ఎంతో మేలు

ఆయిల్ ఫామ్ సాగు తో రైతులకు ఎంతో మేలు
  • రైతులు ఆయిల్ ఫామ్ మొక్కలు నాటుకోవాలి
  • ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి

మోత్కూర్(ముద్ర న్యూస్ ): మండలం లోని జటంగిబావి గ్రామ రైతు పారాల మంజుల భాస్కర్ వ్యవసాయ క్షేత్రంలో 3.5 ఎకరాల్లో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ , బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు.అనంతరం రైతులకు అవగాహన సదస్సును నిర్వహించి ఆయిల్ పామ్ సాగులో మెళుకువలు,సాగు వలన కలిగే లాభాలు రైతులకు వివరించారు. భారతదేశంలో వాడుతున్న వంటనూనెలలో ఎక్కువ శాతం పామ్ ఆయిల్ ను వాడటం జరుగుతుంది సంవత్సరానికి డెబ్భై వేలకోట్ల రూపాయల ఆయిల్ ను విదేశాలనుండి దిగుమతి చేసు కుంటున్నాం.ముందు ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగు విస్తరణకు నిర్ణయం తీసుకున్నాక ఖమ్మం, భద్రాద్రికొత్త గూడెంజిల్లాలతో పాటునూతనంగ గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, జనగాం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు చేయటం జరుగుతుంది.

ఇందుకోసం మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో నర్శరిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పామ్ ఆయిల్ తోటలను పెంచడానికి కేవలం రెండు ఎకరాలు వరి పండించే రైతులందరూ 5 ఎకరాల వరకు ఆయిల్ పామ్ సాగు చేయొచ్చు,ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగులో చీడపీడల బెడద,వర్షాలు,కోతలతో,అడవిపందులతో,గాలి వానాలతో పంటకు ఎలాంటి నష్టం ఉండదు.అలాగే ఆయిల్ పామ్ లో అంతర్ పంటగా వివిధ రకాల పంటలు వేసుకోవచ్చు. కొత్తగూడెం,పాల్వంచ లో ఉన్నటువంటి ఉష్ణోగ్రత తెలంగాణవ్యాప్తంగా ఎక్కడ ఉండదు అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. పామ్ ఆయిల్ పండించే రైతులకు కోసిన గెలలను కొనుగోలు చేయటానికి వారికి అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది లేదా ఫ్యాక్టరీ అందుబాటులో ఉంటే పంటను ప్యాక్టరి దగ్గరికు తీసుకు రావడానికి రవాణా ఖర్చులు పూర్తిగా టి.ఎస్ ఆయిల్ ఫెడ్ భరిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి,రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కొండ సోంమల్లు,మండల పార్టీ అధ్యక్షుడు పొన్నేబోయిన రమేష్, పాటిమాట్ల సర్పంచ్ దండెబోయిన మల్లేష్,లెంకల వేణు,యాదయ్య,ఏఓ స్వప్న, హెచ్ఓ నసీమ,ఆయిల్ ఫెడ్ జిల్లా అధికారి ప్రవీణ్, ఫీల్డ్ ఆఫీసర్ మమత మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.