కేటీఆర్ కు బుద్ధి మొదటి నుంచి ఉంటే జీపి పెండింగ్ బిల్లుల సమస్య ఉండేది కాదు 

కేటీఆర్ కు బుద్ధి మొదటి నుంచి ఉంటే జీపి పెండింగ్ బిల్లుల సమస్య ఉండేది కాదు 

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఒక స్టేట్మెంట్ ఇచ్చారని... అవసరమైతే సర్పంచ్ ల పెండింగ్ బిల్లులకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవస్తానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుందని, కేటీఆర్ కు ఈ బుద్ధి మొదటి నుంచి ఉంటే బాగుండేదని, ఈ పెండింగ్ బిల్లులకు ఎవరు బాధ్యులని, మీరు ఉన్నంతకాలం బిల్లులు విడుదల చేయకుండా పెండింగ్ బకాయిలకు బాధ్యులు గత ప్రభుత్వమే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గ్రామ కారోబార్ ఉద్యోగస్తులు వారి సమస్యల పరిష్కరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ నిధులు విడుదల చేయకపోవడంతో సర్పంచులు రుంగ్రస్తులయ్యారని అన్నారు. సర్పంచుల పదవీకాలం ముగియబోతుందని వారి పదవి కాలం ముగిసేలోపు పెండింగ్ బిల్స్ రావాలని సర్పంచ్లు కోరుకుంటున్నారని, అలాంటి పరిస్థితి కనబడత లేదన్నారు. మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్లకు వేతనాలు చెల్లించకుండా, పార్ట్ టైం క్లర్కులకు గుర్తింపు కలిగించకుండా రెగ్యులర్ చేయకుండా అన్ని సమస్యలు సృష్టించిన కేటిఆర్ నేనింకా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వస్తాను మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నూతన ప్రభుత్వం ఏర్పడిందని తప్పకుండా గ్రామపంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నానని, ఎన్నికల నిర్వహణతో పాటు కావలసిన నిధులు విడుదల చేయాలన్నారు. గ్రామాల్లో ఈరోజు పని జరుగుతుంది అంటే ఆనాడు యూపీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రూపొందించిన ఎన్ ఆర్ ఈ జి ఎస్ అని చెప్పాల్సిందే నని అన్నారు. గ్రామ పంచాయతీల బలోపేతం, పెండింగ్ బకాయిల చెల్లిపు విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేతులెత్తేసిందని అందుకే ప్రజలు తీర్పునిచ్చారని, పార్ట్ టైం క్లర్కులకు లకు ప్రత్యేక హోదా కల్పించాలని.. పార్ట్ టైం వర్కర్లను సీనియారిటి ప్రకారం పర్మినెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని, సేవలకు అనుగుణంగా జీతభత్యాలు చెల్లించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ తెలిపారు.