ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

భువనగిరి జూలై 30 (ముద్ర న్యూస్) భువనగిరి జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో, విద్యార్థి సంఘాలను మీడియాను స్కూల్స్ లోకి కేజీబీవీపీలలోకి సంక్షేమ హాస్టల్స్ లోకి  అనుమతులు లేకుండా రావద్దని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలను నిరసిస్తూ ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ ఈ సందర్భంగా  ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వస్తూపుల అభిలాష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్స్ లోకి, స్కూల్స్ పరిధిలోకి విద్యార్థి సంఘాలు, మీడియాను రావద్దు అని చెప్పడం నిజంగా సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ స్కూల్లో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదని ,సంక్షేమ  హాస్టల్స్ లో కనీసం డైనింగ్ హాల్ సదుపాయం లేక వర్షంలోనే నిలబడి విద్యార్థులు భోజనం చేస్తున్న ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేదన్నా రు.  సమస్యలు ఎక్కడ బయటపడితే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రజలకు తెలిసిపోతుందని, వచ్చే ఎన్నికల్లో ఇది వారికి ఎదురుదెబ్బగా ఉంటుందని భావిస్తూ ఒక ఆలోచన చేసి విద్యార్థి సంఘాలను, మీడియాను రావద్దని అనడం నిజంగా దుర్మార్గమని వాపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వస్తుపుల అభిలాష్, ఉపాధ్యక్షుడు సూరారం జానీ, నాయకులు ధనుష్, బలసాయి, గణేష్, అఖిల్, కోమల్, భాను, భగవాన్  పాల్గొన్నారు.