ఘనంగా ఆరుట్ల జన్మదిన వేడుకలు

ఘనంగా ఆరుట్ల జన్మదిన వేడుకలు

ముద్ర ప్రతినిధి, జనగామ : బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి జన్మదిన వేడుకలను జనగామ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం గిర్నిగడ్డలో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ జనగామ జిల్లా కార్యాలయంలో మాజీ కల్నల్ డాక్టర్‌‌ మాచర్ల భిక్షపతి ఆధ్వర్యంలో దశమంతరెడ్డి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు భారీ కేక్ కట్ చేయించారు.

బచ్చన్నపేట మండల పార్టీ కార్యాలయంలో కూడా ఆరుట్ల పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనగామ జిల్లా కేంద్రంలో శాల సంఘంలోని వర్ధన్ అనాథ ఆశ్రమం, గిర్నిగడ్డలోని రాజరాజేశ్వరి సేవా సదన్ అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. బీజేపీ నర్మెట మండల అధ్యక్షుడు ధరావత్ రాజు నాయక్ మండల కమిటీ నాయకులు ఆరుట్ల నివాసానికి వచ్చి కేక్ కట్ చేయించారు. వారి వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి సౌడ రమేష్, పట్టణం ప్రధాన కార్యదర్శి సంపత్, యువ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి గణపురం కార్తీక్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ మద్దోజు రవితేజ, యువ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రజ్ఞాపూర్ ఆంజనేయులు, దళిత మోర్చ పట్టణం అధ్యక్షులు తోకలా హరీష్, గిరిజన మోర్చ జిల్లా నాయకులు గూగులోతు మధు ఉన్నారు.