ప్రాథమిక ఆరోగ్య  ఉప కేంద్రాల భవనాల మంజూరు.

ప్రాథమిక ఆరోగ్య  ఉప కేంద్రాల భవనాల మంజూరు.
  • నియోజకవర్గంలో 13 PHCలకు భవనాలు మంజూరి.
  • హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి.

హుజూర్ నగర్, ముద్ర: హుజూర్నగర్ నియోజకవర్గం లోని ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాల భవనాలను మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 13 PHC లకు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను మంజూరు చేయించడం దీనికి  సర్క్యులర్ కూడా విడుదల అయినట్లు ఆయా గ్రామపంచాయతీలో ఈనెల 18 వరకు తీర్మానాలను పంపాల్సి ఉందని అన్నారు. నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు.