విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

ముద్ర ప్రతినిధి భువనగిరి:నందనం పరిధిలోని సింగిరెడ్డిగూడెం  ఆవాసంలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం  అయినా సంఘటన   చోటుచేసుకుంది. స్థానికులు,  బాధితులు తెలిపిన వివరాల ప్రకారం  నందన గ్రామానికి చెందిన కడమంచి మల్లయ్య ఇంటిలో  కడమంచి కరుణాకర్ అనే వ్యక్తి ఆయన భార్యతో కలిసి జీవిస్తున్నాడు.

అతను పాత ఇనుప సమన్ వ్యాపారం చేస్తుండగా, అతని భార్య ఫ్యాన్సీ ఐటమ్స్ రోల్డ్ గోల్డ్ వస్తువులు అమ్మి  జీవనం కొనసాగిస్తున్నారు. మంగళవారం ఉదయం ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో ఇల్లు దగ్ధమైనట్లు తెలిపారు. ఈ ఘటనతో సుమారు ఒక లక్ష ఇరవై వేల రూపాయల నగదు మంటలలో ఖాళీ బూడిద కాక, నాలుగు లక్షలకు పైగా ఇంటి  సామాగ్రి, టీవీ, ఫ్రిడ్జ్ లాంటి అనేక వస్తువులు దగ్ధమైనట్లు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ మాజీ సర్పంచ్ కడమంచి ప్రభాకర్ ప్రభుత్వాన్ని కోరారు.