‘మోడల్ కోడ్ ​ఆఫ్​ కండక్ట్’ను​ అమలు చేయండి

‘మోడల్ కోడ్ ​ఆఫ్​ కండక్ట్’ను​ అమలు చేయండి
  • చీఫ్ ఎన్నికల కమిషనర్ కు కాంగ్రెస్ లేఖ

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో మోడల్ కోడ్​ఆఫ్​కండక్ట్ ను అమలు చేయాలని కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేటివ్​కమిషన్ చైర్మన్ నిరంజన్ సోమవారం చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు లేఖ రాశారు. ప్రస్తుత ఎన్నికల చట్టాల ప్రకారం ఎన్నికల సంఘం ఎలెక్షన్స్​షెడ్యూల్‌ను విడుదల చేసిన వెంటనే మోడల్ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందన్నారు. మారిన పరిస్థితులు, అధికార పార్టీ అధికార దుర్వినియోగం దృష్ట్యా వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో 115 స్థానాలకు పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఎన్నికల ప్రచారం కూడా మొదలైందంటూ మీడియాకు వివరించారన్నారు. దీంతో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికార యంత్రాంగం, పోలీస్​అధికారుల సహాయంతో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, కొత్త పథకాల ప్రకటనల్లో పాల్గొనకుండా నిరోధించేందుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను వెంటనే విధించాలని కోరారు.