రైతులకు నష్టపరిహారం అందజేయాలి...

రైతులకు నష్టపరిహారం అందజేయాలి...
BJP district spokesperson Marripalli Satyam

 బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపల్లి సత్యమ్..

పెగడపెల్లి, ముద్ర : గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలకు వడగండ్ల వానలకు పంట పొలాలు, మామిడి తోటలు,నువ్వు పంటలు, మొక్కజొన్న పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారుల చేత పంట నష్టాన్ని అంచనా వేయించి నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పెగడపెల్లి మండలంలోని బతికేపెల్లి గ్రామంలో నష్ట పోయిన పంటపొలాలను బీజేపీ నాయకులు దర్శించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ గత ఖరీఫ్ సీజన్లో  కురిసిన భారీ వర్షాలకు జగిత్యాల జిల్లాలో దాదాపు పదివేల ఎకరాల్లో పసుపు మొక్కజొన్న వారి పంటలు నీట మునిగి ఇసుక మేటలు పెట్టి రైతులుతీవ్రంగా నష్టపోయారని కానీ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి పంట నష్టాన్ని అంచనా వేయడం కానీ నష్టపరిహారం చెల్లించడం కానీ జరగలేదన్నారు.

కేవలం రైతుబంధు పేరిట ఎకరానికి అయిదు వేలు  ఇస్తున్నాం అనే భావనతో రైతులకు అతివృష్టి అనావృష్టి మరియు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్టాన్ని అంచనా వేయడం లేదని ఎలాంటి నష్టపరిహారం ఇవ్వడం లేదని అన్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వడగండ్లతో కూడిన అకాల వర్షాలకు జిల్లాలో వేలాది మంది రైతులు నష్టపోతున్నారని వారి యొక్క పంట నష్టాన్ని అధికారుల చేత అంచనా వేయించి ఎకరానికి 20వేల చొప్పున  నష్టపరిహారం వెంటనే అందించాలని కోరారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు పెంట నరేందర్ కాకళ్ల సతీష్ చింతకింది కిషోర్ కడారి జనార్దన్ మూడపెల్లి శ్రీనివాస్ మన్నే రమేష్ ఉప్పులంచ రమేష్ రైతులు తదితరులు పాల్గొన్నారు.