మంథనిలో  యూరియా కష్టాలు

మంథనిలో  యూరియా కష్టాలు
  • ఒక్క రైతుకు రెండు బస్తాలు మాత్రమే 

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:- మంంథని రైతులకు ఈ ఏడు యూరియా కష్టాలు మొదలైనట్లే కనబడుతుంది. గత 20 రోజులుగా సొసైటీలో ఫెర్టిలైజర్ షాపులలో యూరియా లేదంటూ రైతులను ముప్పతిప్పలు పెడుతున్నారు. డీలర్లు అధికారులు చేతులు ఎత్తేయడంతో రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నట్టు తెలుపుతున్నారు.  మంగళవారం మంథని సొసైటీలో 100 మంది పైన రైతులు యూరియా కోసం పడిగాపులు కాయగా కేవలం 120 బస్తాలు ఉన్నాయంటూ సొసైటీ వారు ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇస్తామని సొసైటీలో ఉన్నవి కేవలం 120 బస్తాలేనని సొసైటీ వారు తెలుపడంతో  యూరియా కోసం మేము ఎక్కడికి పోవాలి అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు రైతులకు వెంటనే యూరియా బస్తాలు అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందన్నారు.