జులై 2 వరకు ఈవీఎంల తనిఖీ

జులై 2 వరకు ఈవీఎంల తనిఖీ

జిల్లా ఉప ఎన్నికల అధికారి ప్రపుల్ దేశాయ్‌
ముద్ర ప్రతినిధి, జనగామ: జిల్లాకు కొత్తగా వచ్చిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్ మిషన్లను జులై 2 వరకు పూర్తి స్థాయి తనిఖీ చేయనున్నట్టు జిల్లా ఉప ఎన్నికల అధికారి, అడిషనల్‌ కలెక్టర్‌‌ ప్రపుల్ దేశాయ్ షురూ తెలిపారు. శనివారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం సిబ్బందితో కలిసి ఆయన ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియను ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ జిల్లాకు కొత్తగా వచ్చిన 1,430 కంట్రోల్ యూనిట్స్, 1,845 బ్యాలెట్ యూనిట్స్, 1,406 వీవీ ప్యాట్స్ లను మొదటి లెవెల్ తనిఖీ కోసం ఈసీఐఎల్ కంపెనీ ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం సిబ్బంది కలిసి క్షుణ్ణంగా పరిశీలిస్తారని చెప్పారు. ఏమైనా ఇబ్బందులు, సాంకేతిక కారణాలు ఉన్న వాటిని రిజర్వులో ఉంచుతారని తెలిపారు. ఈ తనిఖీ ప్రక్రియ పది రోజులపాటు (జులై 2 వరకు) కొనసాగుతుందని, ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని నియమించామని తెలిపారు.