జడ్జీలను బెదరించడమేనా ప్రజాస్వామ్యం?

జడ్జీలను బెదరించడమేనా ప్రజాస్వామ్యం?

ముంబై: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు  కొంతమంది రిటైర్జ్ జడ్జిలపై చేసిన వ్యాఖ్యలపై శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే  నేత సంజయ్ రౌత్  ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రిటైర్డ్ జడ్జీలు ఇండియా వ్యతిరేక గ్యాంగులో భాగమంటూ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇది న్యాయమూర్తులను బెదిరించేందుకు, న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్దేశించిన ప్రయత్నమని తప్పుపట్టారు. ఇది న్యాయమంత్రికి సరికాదని, ఇదేనా ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు.

కిరణ్ రిజిజు శనివారం ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడుతూ, కొందరు రిటైర్డ్ జడ్జిలు, వారి కార్యకలాపాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత న్యాయవ్యవస్థను విపక్ష పార్టీ పాత్ర వహించేలా చేసేందుకు జరుగుతున్న 'యాంటీ ఇండియా గ్యాంగ్‌'లో కొందరు రిటైర్డ్ జడ్జిలు పాలుపంచుకుంటున్నారని ఆక్షేపించారు. మంత్రి వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ ఆదివారం  మీడియాతో మాట్లాడుతూ..''ఇది ఏతరహా ప్రజాస్వామ్యం? న్యాయ వ్యవస్థను బెదరించడం న్యాయశాఖ మంత్రికి తగిన పనేనా? ప్రభుత్వానికి తలవొగ్గని న్యాయమూర్తులకు ఇది ముప్పు. న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం'' అని అన్నారు.