బీఆర్ఎస్​కు అనుకూలతే కారణమా..?

బీఆర్ఎస్​కు అనుకూలతే కారణమా..?

ముద్ర, తెలంగాణ బ్యూరో : అధికార బీఆర్ఎస్​కు అనుకూలంగా వ్యవహరించడంతోనే ఐఏఎస్, ఐపీఎస్​ల బదిలీలకు కారణమనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో చాలా మంది ఐఏఎస్​లు, ఐపీఎస్​లు బీఆర్ఎస్​పార్టీ, నేతలకు అనుకూలంగా పని చేస్తున్నారంటూ విపక్ష పార్టీలు ఇటీవల హైదరాబాద్​కు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందానికి ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ నుంచి ఎంఆర్‌ఓ వరకు కొందరు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాని సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

బీఆర్ఎస్​ఎన్నికలలో విజయం సాధించే ప్రయత్నంలో తన అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర యంత్రాంగాన్ని, వనరులను వాడుకుంటుందని, అధికారులను పోస్టింగ్, రిటైన్ చేయడానికి తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్​నేత బక్క జడ్సన్​ఫిర్యాదు చేశారు. సెంట్రల్ విజిలెన్స్ మార్గదర్శకాలు, డీఓపీటీ సర్క్యులర్‌లు ఉన్నప్పటికీ చాలా మంది అధికారులు ఒకే స్థానంలో ఐదేళ్లకు పైగా విధులు నిర్వర్తిస్తున్నారని అందులో పేర్కొన్నారు. తెలంగాణలో స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికల వాతావరణం నెలకొల్పేందుకు ఆ పార్టీకి అనుకూలంగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులందరినీ తక్షణమే బదిలీ చేసి,నాన్ ఫోకల్ ఉద్యోగాలకు పోస్ట్ చేయాలని ఆయన కోరారు.