బిజెపి బలోపేతం కోసం జెట్లీ నిరంతరం కృషి చేశారు.....

బిజెపి బలోపేతం కోసం జెట్లీ నిరంతరం కృషి చేశారు.....
  • బిజెపి నాయకుల వెల్లడి....

ఆలేరు (ముద్ర న్యూస్):భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ కేంద్ర మంత్రి. పద్మ విభూషణ్ అరుణ్ జైట్లీ బిజెపి పార్టీని బలోపేతం చేస్తూనే కేంద్ర మంత్రిగా ప్రజలకు అనేక సేవలు అందించారని బిజెపి ఆలేరు అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్ అన్నారు. గురువారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో అరుణ్ జెట్లీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అరుణ్ జెట్లీ స్ఫూర్తితో బిజెపిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికలలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బడుగు జహంగీర్. మండల అధ్యక్షులు దూసరి రాఘవేంద్ర. పట్టణ ఉపాధ్యక్షులు జెట్ట సిద్దులు. కళ్లెం రాజు. ప్రధాన కార్యదర్శి పులిపలుపుల మహేష్. కార్యదర్శులు కుడికాల మురళి. ఆయిలి సందీప్. పట్టణ బిజెవైఎం అధ్యక్షులు పేరపు ఆనంద్. కారదర్షి కటకం వెంకటేష్. జిల్లా నాయకులు పాకంటి సంపత్. కంతుల శంఖర్. సీనియర్ నాయకులు మంత్రి భాస్కర్. జూల శ్రీధర్. సోమయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.......