జాతీయ స్థాయిలో రాణించిన స్కేటింగ్ క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే 

జాతీయ స్థాయిలో రాణించిన స్కేటింగ్ క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణానికి చెందిన అద్వైత్, అభినవ్ సాయి, ప్రీతం స్పీడ్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన  జాతీయ స్థాయి స్పీడ్ స్కేటింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్, బ్రాంజ్ మెడల్ సాధించగా వారని  జగిత్యాల ఎమ్మేల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సత్కరించి, అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  విద్య ఎంత ముఖ్యమో శారిరక దారుడ్యం,  ఆటలు అంత ముఖ్యమని నేటి సాంకేతిక... సోషల్ మీడియా తో పిల్లలో క్రీడా స్ఫూర్తి తగ్గిందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు దావా సురేష్ , మతులపురం శేకర్,వంశీ బాబు,రవి శంకర్,శరత్ రావు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.