కనీస మద్దతు ధరకు చట్టబద్దత  కల్పిస్తాం..

కనీస మద్దతు ధరకు చట్టబద్దత  కల్పిస్తాం..
  • ఓటు..మీ ఐదేళ్ల భవితవ్యం కోసం వేయండి.. ప్రజలు ఆలోచించాలి..
  • ఎంపీ గా అవకాశం ఇవ్వండి ..
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: వ్యవసాయాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న పార్టీ పై ఉందని, కనీస మద్దతు ధర కు చట్ట బద్ధత కల్పించడం కాంగ్రెస్ బాధ్యత తీసుకుంటుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.  జగిత్యాల మండలం మోతే గ్రామంలో బిఆర్ ఎస్ ఎంపిటిసి రొక్కం రాజశేకర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ వెంకటేష్, వార్డు సభ్యులు, కులసంఘాల నయాకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా తన జీవితాన్ని జగిత్యాల ప్రజలకే అంకితం చేసి, అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించారని పేర్కొన్నారు.  

ఆలాగే పలు సమస్యలు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకోరాగ పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.  అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు అండగా నిలువాలని  కోరారు. అవకాశం కల్పించండి..ఎం పీ గా గెలిపిస్తే, మరింత అభివృద్ది చేస్తా అని భరోసా నిచ్చారు. మాస్టర్ పాలన లో మోతే చేర్చాల్సిన అవసరం ఏముందని, రాజకీయాలకు అతీతంగా రోడ్లు ఎక్కి, ఉద్యమిస్తే వెనకడుగు వేశారు. మాస్టర్ ప్లాన్ లో గ్రామాల్ని చేర్చింది ఆయనే.. నిలిపి వేసింది ఆయనే..అని పరోక్షంగా ఎమ్మెల్యేను ఉద్దేశించి అన్నారు.జగిత్యాల పట్టణానికి పరిమితం చేసేలా, గ్రామాలకు సంబంధం లేకుండా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని, సీఎం రేవంత్ రెడ్డీ ఆధ్వర్యంలో సంవత్సరానికి ప్రతి ఇంటికి 30,000 లబ్ది చేకూరుతుంది. ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఓటు మీ ఐదేళ్ల భవితవ్యం కోసం వేయండని పేర్కొన్నారు.  వ్యవసాయం పై ఆధాపడే ప్రతి ఒక్కరూ రైతే అని, దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం... వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తేనే దేశం అభివృద్ధి జరుగుతుందన్నారు.

ఉత్తర తెలంగాణ తాగు నీరు, సాగు నీరు కు అందని పరిస్థితి నుండి ఎస్ఆర్ఎస్పీ తో సస్యశ్యామలం అయిందని, చివరి భూములకు నీరు అందడం లేదని, బావుల పై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు భారం కాకూడదని వై ఎస్ రాజశేఖర రెడ్డి రైతులకు ఉచితంగా విద్యుత్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. బీ ఆర్ ఎస్ పాలనలో మిల్లర్ల దోపిడీ పెరిగిందని, మళ్లీ రైతు రాజ్యం వచ్చింది..తరుగు లేకుండా  ధాన్యం తూకం వేయిస్తమని అన్నారు. దేశ సరిహద్దుల్లో రైతులు పోరాటం చేస్తే, కనీస మద్దతు ధరకు చట్ట బద్దత కల్పించేందుకు మోడీ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అని ప్రశ్నించారు. మోడీ వ్యవసాయదారుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి, పెట్టుబడి మాత్రం రెట్టింపు చేశారని విమర్షించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయ లక్ష్మి దేవేందర్ రెడ్డి,  జగిత్యాల రూరల్ ఎం పీ పీ మహేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, కాంగ్రెస్ జగిత్యాల  అర్బన్ మండల అధ్యక్షుడు గంగాధర్, జగిత్యాల రూరల్ మండల అధ్యక్షుడు జున్ను రాజేందర్, పాక్స్ వైస్ చైర్మన్ సురేందర్, పిట్ట మల్లేశం, పిట్ట లింగా రెడ్డి, సంగేపు మల్లా రెడ్డి, దాసరి పోషయ్య తదితరులు పాల్గొన్నారు.