కర్రే వెంకటయ్య ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు..

కర్రే వెంకటయ్య ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు..

యాదగిరిగుట్ట (ముద్ర న్యూస్):బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మరియు రాష్ట్ర ఐటీ. పురపాలక శాఖల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో గల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో జిల్లా సర్పంచుల కోరం అధ్యక్షులు మరియు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం. యువతకు ఉపాధి అవకాశాల కోసం పరితపించే మంత్రి కేటీఆర్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకునేలా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధ హేవేందర్ గౌడ్. యాదగిరిగుట్ట జడ్పిటిసి సభ్యురాలు తోటకూర అనురాధ బీరయ్య. సీనియర్ నాయకులు మిట్ట వెంకటయ్య. కసావ్ శ్రీనివాస్ గౌడ్. కటేకార్ పవన్. గౌలికార్ రాజేష్ తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు. కోఆప్షన్ సభ్యులు. వివిధ గ్రామాల సర్పంచులు. బిఆర్ఎస్ నాయకులు. కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు.