మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలు..

మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలు..
  • పట్టించుకోని మండల అధికారులు..
  • ఇంటింటికి మంచినీరు అందించే పథకం నీరుగారుతుంది..

గొల్లపల్లి. ముద్ర:- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి తూట్లు పడుతున్నాయి.ఇంటింటికి మంచినీరు అందించే పథకం నీరుగారుతోంది. నాసిరకమైన పనులతో ప్రజాధనం వృధా ఖర్చు అవుతుంది.పైపులైన్లు ఎక్కడికిక్కడ లీకేజీల ఆవుతున్నాయి.గొల్లపల్లి మండలం కేంద్రం నుండి గోవిందుపల్లె వెళ్లే మార్గ మధ్యలో ప్రథమ మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయి నీరు వృథాగా చేనులోకి పోతోంది.ఇప్పుటి వరకు నాలుగు ఐదు సార్లు మరమ్మతులు చేసిన యధావిధిగా లీక్ అయితేనే ఉంది.ఏ ఈ ఈ ని ఫోన్ ద్వారా పైప్ లైన్ లీకేజీకి గురించి వివరణ కోరగా సంబంధంలేని విషయం చెపుతున్నారు.మండల అధికారులు పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.వేసవికాలం కావడంతో నీళ్లు గ్రామాలకు ప్రతి రోజు సరఫరా చేయవలసిన బాధ్యత మండలాధికారులపై ఉన్న పట్టించుకోవడంలేదని కొందరు వ్యక్తం చేస్తున్నారు. వారనికి ఒక్కసారి అరకొర నీళ్లు వస్తున్నాయిని ప్రజలు అంటున్నారు.సక్రమంగా రావడంలేదని వచ్చినా నీళ్ల మురికి నీళ్లు వస్తున్నాయని ఆయాగ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుటికైనా సరైన మరమ్మత్తులు చేసి ఆయా గ్రామాలకు నీటి ఎద్దడి లేకుండా అందించాలని  ఆయా గ్రామ ప్రజలు ఉన్నత ధికారులను కోరుచున్నారు.