ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో మెలగాలి

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో మెలగాలి
  • టీయూడబ్య్లుజే(ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి గుడుపల్లి శ్రీనివాస్
  • ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి పునః ప్రతిష్ట వేడుకలు

ముద్ర, షాద్ నగర్:- ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో మెలగాలి టీయూడబ్య్లుజే(ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి గుడుపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం కేశంపేట  మండల పరిధిలోని పుట్టోనిగూడ గ్రామంలో దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయస్వామి పునః ప్రతిష్ట కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జి శ్రీనివాస్ మాట్లాడుతూ... దైవ చింతనతోనే మనసుకు ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ దైవ భక్తిని కలిగి ఉండాలని సూచించారు. నేటి పోటీ ప్రపంచంలో దైవన్నామస్మరణ తగ్గిపోతుందని దాంతో ఒత్తిడి పెరిగి అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారని తెలిపారు. దైవభక్తిని అలవర్చుకుంటే మనసుకు ప్రశాంతతతో పాటు ఎలాంటి వ్యాధులు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ జర్నలిస్టులు రాఘవేంద్ర యాదవ్, రమేష్, శివకుమార్, శ్రీనివాస్, విష్ణు, రాజు లు పాల్గొన్నారు.