కన్నుల పండుగ పరమేశ్వరుడి విగ్రహ ప్రతిష్టాపన..

కన్నుల పండుగ పరమేశ్వరుడి విగ్రహ ప్రతిష్టాపన..
Former MLA Choulapalli Prathapara Reddy who performed special pooja

ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి 

ముద్ర, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలోని బుగ్గన గూడ గ్రామంలో పరమేశ్వరుడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  బుగ్గోనిగూడలో  సర్పంచ్ బండి నీలమ్మ రాజు ఆధ్వర్యంలో కాశీ విశ్వేశ్వరుని లింగ ప్రతిష్ట చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు దైవభక్తితో పాటు సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాలమూరు జడ్పీ మాజీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి, కొత్తూరు ఉమ్మడి మండలం మాజీ ఎంపీ శివ శంకర్ గౌడ్, చేగుర్ సింగిల్ విండో డైరెక్టర్ బండి మల్లేష్, ఉప సర్పంచ్  బుగ్గ స్వరూప శ్రీనివాస్, చేగురు ఉప సర్పంచ్ సురేష్ గౌడ్, వార్డు సభ్యులు ఎం భాస్కర్ గౌడ్,  బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బుగ్గ నరసింహ, సాతోళ్ల యాదయ్య, సాలయ్య, బండి రమేష్, కాంగ్రెస్ పార్టీ బుగ్గ శ్రావణ్, బి ఆర్ ఎస్ పార్టీ  నాయకులు ఎం శ్రీనివాస్ గౌడ్, ఆర్ విజయ్ గౌడ్, నరేష్, రాఘవేందర్ గౌడ్, గణేష్ గౌడ్, గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.