మోది వందరోజుల గ్యారెంటీల గురించి మాట్లాడడం  ఆశ్చర్యం

మోది వందరోజుల గ్యారెంటీల గురించి మాట్లాడడం  ఆశ్చర్యం
  • నల్ల ధనాన్ని ఎంత మంది పేదల ఖాతాల్లో వేశారు
  • సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు  ఏవి 
  • ప్రధాని మోదిని ప్రశ్నించిన ఎమ్మెల్సి జీవన్ రెడ్డి 
     

ముద్ర,  రాయికల్ : అంత పెద్ద మనిషి అయిన మోది తెలంగాణ కాంగ్రస్ ప్రభుత్వ వందరోజుల గ్యారెంటీ గురించి మాట్లాడడం  ఆశ్చర్యం వేసిందని,  వంద రోజులు ఆరు గ్యారెంటీలో 5 అమలు చేశాం...  దేశంలో ఏ రాష్ట్రంలోనైనా వంద రోజుల్లో ఎన్నికల ప్రణాళిక అమలు చేసిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాని మోడిని  ప్రశ్నించారు. రాయికల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ మోది  విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకుని వచ్చి పేదల అకౌంట్లో 15 లక్షలు వేస్తానని పేర్కొన్నారు .. ఎంతమంది అకౌంట్ లో వేసారని ప్రశ్నించారు. కానీ విదేశాల్లో నల్లధనం అప్పటికి ఇప్పటికి రెట్టింపు అయిందన్నారు. పారదర్శకత, నీతి, అవినీతి గురించి మోది మాట్లాడడం ఆశ్చర్యం గురిచేస్తుందన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని అలాంటి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించలేని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్నారు. 2014లో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని పదేళ్లు గడిచాయని, పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇయ్యాలి కానీ... యువత ఇప్పుడు తల్లిదండ్రుల గుండెలపై కుంపటిలా ఉన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓ వ్యాపార సంస్థల తయారై ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తుందన్నారు. దేశంలో ప్రధాన ఉత్పత్తి అయిన వ్యవసాయంపై మోడీ నిర్లక్ష్యం కొనసాగుతుందన్నారు.

రైతులకు రుణమాఫీ చేయాలని అంటే.. రైతులకు రుణమాఫీ చేస్తే రైతులు సోమరిపోతులు అవుతారని బిజెపి వాళ్లు పేర్కొంటున్నారని అన్నారు. లక్షల కోట్లు బకాయిలు ఉన్న ఆధాని, అంబానీలకు రుణ విముక్తి కల్పించారని,  రైతుకు లక్ష రూపాయలు మాపి  చేస్తే సోమరిపోతులు అవుతారని అంటున్నారు మరి అధాని, అంబానీ సోమరిపోతులు కారా అని ప్రశ్నించారు. ఈ  కార్యక్రమం లో కాంగ్రెస్  పార్టీ పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేష్, జగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి కొయ్యడి మహిపాల్,మండల అధ్యక్షుడు రవీంధర్ రావు,గోపిరాజా రెడ్డి బాపురపు నర్సయ్య,నర్సింహా రెడ్డి,దివాకర్,గంగాధర్,గంగారెడ్డి,మహేంధర్ గౌడ్, నాగరాజు,షాకీర్, శ్రీకాంత్, రాకేష్ నాయక్,సాగర్,సుధీర్, హరీష్ రావు తదితరులు పాల్గొన్నారు.