నూతన గ్రామ పంచాయతీ భవన శంకుస్థాపన తో పాటు  సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేసిన  పెద్దపల్లి ఎమ్మెల్యే  విజయరమణ రావు 

నూతన గ్రామ పంచాయతీ భవన శంకుస్థాపన తో పాటు  సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేసిన  పెద్దపల్లి ఎమ్మెల్యే  విజయరమణ రావు 

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:  నూతన గ్రామ పంచాయతీ భవన శంకుస్థాపన తో పాటు  సీసీ రోడ్డు ను బుధవారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావుప్రారంభోత్సవం చేశారు. ఓదెల మండలంలోని పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామంలో ఎన్ఆర్ జిఎస్ నిధులతో  రూ. 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ నూతన భవన శంకుస్థాపన చేశారు. ఎస్ డీఎఫ్ నిధులతో రూ. 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు.

 
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి సంక్షేమo కోసం నిరంతరం కృషి చేస్తుందని, అలాగే పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి నా వంతు కృషి ఉంటుందని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం 6 గ్యారంటీలను తూచా తప్పకుండా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు  ఆధ్వర్యంలో అమలు చేస్తామన్నారు. గ్రామ సభల ద్వారా అర్హులైన నిరుపేదలకు ఈ 6 గ్యారంటీలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. 

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, గ్రామ సర్పంచ్ పిట్టల సరిత రవి కుమార్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, గోపు  నారాయణ రెడ్డి, చొప్పరీ రాజయ్య, పుప్పాల శెంకర, అంకం రమేశ్, ఆల్ల సుమన్ రెడ్డి, బొంగొని శ్రీనివాస్, వంగ శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, అశోక్, సమ్మయ్య, కొమురయ్య, చింతం స్వామి,, గోపతి సది,నగపురి రావి,నాయకులు కార్యకర్తలు మరియు యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.