కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి జనం సిద్ధమయ్యారు..

హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్

ముద్ర న్యూస్:యావత్ తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారని హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నం ప్రభాకర్ ఆదివారం ఎల్కతుర్తి మండల కేంద్రంతో పాటు దామెర, చింతలపల్లె, శాంతి నగర్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. తీన్మార్ మల్లన్న తో కలిసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం హుస్నాబాద్ ను సెంటిమెంట్ గా భావిస్తాడు... కానీ, డెవలప్ మెంట్ చేయడని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నేరీవర్చబోయే ఆరు గ్యారెంటీ పథకాలను పొన్నం ప్రజలకు వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతినెల రూ. 2500 ఇవ్వడం జరుగుతుందన్నారు. రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వబడుతుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతు భరోసా పథకం, గృహ జ్యోతి, యువ వికాసం పథకాల గూర్చి వివరించారు. పేద వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షల సాయం చేస్తుందని తెలిపారు. వృద్ధులకు రూ. 4 వేల చేయూత ఫించన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు అశోక్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఇంద్ర సేనా రెడ్డి, సీపిఐ జిల్లా నాయకులు కర్రే భిక్షపతి, సిపిఐ మండల కార్యదర్శి రాములు, మాజీ సొసైటీ చైర్మన్ గోలి రాజేశ్వర్ రావు, ప్రో వీరన్న నాయక్, మాజీ మండల అధ్యక్షులు సంతాజి, కాంగ్రెస్, సీపీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.