RSS chief Mohan Bhagwat - రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

RSS chief Mohan Bhagwat - రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

ముద్ర,సెంట్రల్ డెస్క్:- ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ల విషయంలో ఆర్ఎస్ఎస్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. స్వార్థంతో ఆర్ఎస్ఎస్‌ మీద మాట్లాడుతున్నారని.. ఇదంతా దుష్ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. వివాదం సృష్టించి లబ్ధిపొందాలని చూస్తున్నారని.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు.

ఎవరికోసమైతే రిజర్వేషన్లు కేటాయించారో.. ఆ వర్గం వాళ్లంతా అభివృద్ధి చెందేవరకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని చెప్పుకొచ్చారు.రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని మోహన్ భగవత్ క్లారిటీ ఇచ్చారు. అవసరమైనంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విషయంలో ఆర్ఎస్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోహన్ భగవత్ ధ్వజమెత్తారు.