ఎలక్ట్రిసిటీ స్టోర్ హమాలీలను రెగ్యులర్ చేయాలి: డిప్యూటీ సీఎం కు వినతి

ఎలక్ట్రిసిటీ స్టోర్ హమాలీలను రెగ్యులర్ చేయాలి: డిప్యూటీ సీఎం కు వినతి

 చండూరు, ముద్ర: రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఉన్న ఎలక్ట్రిసిటీ స్టోర్ లలో పనిచేస్తున్న హమాలీలను రెగ్యులర్ చేస్తూ నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ అల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ ) రాష్ట్ర గౌరవాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి కోరారు 
శనివారం సిపిఎం శాసనసభ పక్ష మాజీ నాయకుడు జూలకంటి రంగారెడ్డి, ఎలక్ట్రిసిటీ స్టోర్ హమాలి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కత్తుల యాదయ్యలతో కలిసి రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ప్రజా భవన్ లో కలిసి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా  ఆయనమాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 220 మంది ఎలక్ట్రిసిటీ స్టోర్  కార్మికులుగా విద్యుత్ పరికరాలు ఎగుమతి దిగుమతులు చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు.

వ్యవసాయం పారిశ్రామిక అభివృద్ధిలో విద్యుత్తు  పరికరాలను లోడింగ్ అన్లోడింగ్ నిర్వహిస్తూ, ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత ప్రమాదకరమైన బరువైన సామాగ్రిని ప్రమాదాలకు గురవుతూ అభద్రత భావంతో జీవనం కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు.విద్యుత్ శాఖలో గత 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్న మమ్ములను గత ప్రభుత్వానికి అనేకమార్లు విజ్ఞప్తి చేశాము. ఇదే సంస్థలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను ఆర్టిజన్ గా గుర్తించినది  అదేవిధంగా ఎలక్ట్రిసిటీ స్టోర్లలో ఎగుమతి దిగుమతులు నిర్వహిస్తున్న కార్మికులను ఆర్టిజన్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పిస్తూ రెగ్యులరైజ్ చేయాలని కోరారు.ఈ వినతిపత్రం కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ స్టోర్ హమాలి వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ ) నాయకులు శ్రీనివాస్, శంకర్, యాదగిరిరెడ్డి తదితరులు ఉన్నారు