ముద్ర కథనానికి స్పందన - ముత్తారం మండల ప్రజలకు తిరనున్న ఇసుక కష్టాలు...

ముద్ర కథనానికి స్పందన - ముత్తారం మండల ప్రజలకు తిరనున్న ఇసుక కష్టాలు...
  • మన ఇసుక వాహనం వెబ్ సైటు ద్వారా ఆన్లైన్ బుకింగ
  • బుధవారం ముత్తారం రీచ్ లో ప్రారంభం
  • ఇసుక అక్రమ రవాణా చేస్తే వాహనాలు సీజ్
  • పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్


ముత్తారం, ముద్ర:- మండలంలో  ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ హెచ్చరించారు. ఇటీవల (మానేరులో దొంగలు పడ్డారు)  అనే కథనంతో ముద్ర పత్రికలో ప్రచురితం కాగా, స్పందించిన జిల్లా కలెక్టర్ మండలంలో ఎవరికైనా ఇసుక కావల్సిన వారు మన ఇసుక వాహనం అనే వెబ్ సైట్ ద్వారా (manaesuka vahanam) బుకింగ్ చేసుకోవాలని సూచించారు.  అలాగే మీసేవ సెంటర్ ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే, స్థానిక తహసీల్దార్, పోలీస్,  మైనింగ్ అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో సాండ్ టాక్స్ ను  సాండ్ రీచ్ ఎస్. ఆర్. ఓ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యజమానులు పాల్గొన్నారు.